ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS : అన్న క్యాంటీన్లలో ప్రతిరోజు నిర్దేశిత సమయానికే ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదేశించారు.
Commissioner Puli Srinivasulu
బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను ప్రతిరోజు నిర్దేశిత సమయానికి ఆహారం అందించాలన్నారు. క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ప్రజలు క్యాంటీన్ లో అందే ఆహారంపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియ చేయవచ్చన్నారు.