ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM..జాతీయ రహదారి భూసేకరణ సర్వే నంబర్ల భూములు పరిశీలించిన.. భార్గవ తేజ
నేషనల్ హైవే ఆథారిటీ ఇండియా ఆదేశాల మేరకు వినుకొండ – గుంటూరు జాతీయ రహదారి నంబర్ 544D నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా భూ సేకరణ నిమిత్తం గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ , గుంటూరు భూ సేకరణ అధికారి భార్గవ తేజ గురువారం ఫిరంగిపురం మండలంలో పర్యటించారు. మండలంలో భూ సేకరణ చేయబడుతున్న 7 గ్రామాలు 1.పొనుగుపాడు 2. మేరికపూడి 3. నుదురుపాడు 4. వేమవరం 5. రేపూడి 6. ఫిరంగిపురం 7. అమీనాబాద్ గ్రామము ల నందు భూ సేకరణ ద్వారా సేకరించుబడుతున్న సర్వే నెంబర్లు నందు గల భూములను పరిశీలింఛి సంబంధిత రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం తహసిల్దార్ జె.ప్రసాద రావు , మండల సర్వేయర్, ఫిరంగిపురం, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ , ఫిరంగిపురం, ఆయా గ్రామాల రెవిన్యూ అధికారులు ,గ్రామ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.