ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM..బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని నిరసన
ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో CPM ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CPM మండల కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి నిరాశ మిగిలిందని, బడ్జెట్ లో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో CPM నాయకులు బాలకృష్ణ, గ్రామ రైతులు పాల్గొన్నారు