
అమరావతి: 20 సెప్టెంబర్ 2025 :ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక.
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సభ్యులు అప్రమత్తంగా ఉండాలి:
- పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దు.
- ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగ్స్, బిల్లుబోర్డ్స్, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకండి.
ప్రజలు తమ భద్రతను గమనించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
ప్రఖర్ జైన్,
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA)










