
నెల్లూరు: జనవరి 02:-పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా వారి విద్యాభివృద్ధి, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.

నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు కలెక్టర్‌కు అందించిన విద్యా సామగ్రిని పేద విద్యార్థులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యార్థులకు నిఘంటువులు, నోట్‌పుస్తకాలు, లేఖన సామగ్రితో పాటు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
జనవరి 01వ తేదీన నగరంలోని ఆర్.కె.నగర్‌లోని జనహిత–వాత్సల్య అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థులకు 250 విద్యా సామగ్రి కిట్లు, స్వీట్లు, పండ్లు అందజేశారు. అలాగే శుక్రవారం కావలిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు కూడా కలెక్టర్ స్వయంగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లాంగ్ నోట్ పుస్తకాలు 834, షార్ట్ నోట్ పుస్తకాలు 368, పరీక్ష ప్యాడ్లు 138, పెన్సిళ్లు 180, పెన్లు 795, పెన్–పెన్సిల్ కాంబో బాక్స్‌లు 40 ప్యాకెట్లు, కలర్ క్రేయాన్లు 10 ప్యాకెట్లు, నిఘంటువులు 262, అట్లాస్‌లు 9, ఇంగ్లీష్ వ్యాకరణ పుస్తకాలు 4, వాల్మీకి రామాయణం పుస్తకాలు 7 పంపిణీ చేశారు. అదనంగా ఆపిల్స్ 90, నారింజలు 130, స్వీట్లు 4 కిలోలు, కేక్ 1 కిలోను విద్యార్థులకు అందజేశారు.Nellore local news:అనంతసాగరంలో ఆస్తాన ఏ మష్ కూరియాలో జల్స-ఎ-గ్యార్మి ఘనంగా
విద్యార్థుల అవసరాలను గుర్తించి చదువుకు అవసరమైన పుస్తకాలు, లేఖన సామగ్రి అందించడం ద్వారా వారి విద్యా ప్రగతికి తోడ్పడడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.










