
ఫిరంగిపురం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 26వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు గొర్రెలు, మేకలు పెంపకందారులకు నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని నుదురుపాడు పశు వైద్యాధికారి షేక్ పీర్ అహ్మద్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న పశుసంవర్ధక శాఖ సిబ్బంది కాంపెయిన్ మోడ్లో జీవాలకు నట్టల నివారణ మందులను తాగించడం జరుగుతుంది అన్నారు.







