గుంటూరు, సెప్టెంబర్ 14 : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజి ఆర్ ఎస్) లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. అర్జీదారులు
Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకొనుటకు 1100 (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు.
2,283 Less than a minute