
బాపట్ల: 05-12-2025:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించి లబ్ధిదారులు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అభిలషించారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో పీఎంఈజీపి పథకం కింద చెరుకుపల్లి మండలం గోడవల్లి గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు తురిమెళ్ళ కరుణకుమారికి జీవనోపాధి కోసం కియా కారును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం స్కీం ద్వారా లబ్ధిదారులు కోరిన ప్రకారం యూనిట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. కరుణకుమారికి అందజేసిన కియా కార్ యూనిట్ విలువ రూ.13,93,000 కాగా, ఇందులో బ్యాంకు రుణం రూ.13,11,000, లబ్ధిదారుని వాటా రూ.82,000 ఉంటాయని, ఈ పథకం క్రింద 35 శాతం సబ్సిడీ వర్తించనున్నట్లు వివరించారు.కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లవన్న, సంబంధిత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







