

చిన్నగంజాం మండలంలోని పెదగంజాం పంచాయతీలో వెలుగు drda ఆధ్వర్యంలో pmfme కింద ₹1,50,000 విలువచేసే కారపు మిల్లు పిండి మిల్లును జొన్నలగడ్డ శ్యామల అనే ఆమెకు గ్రామ పార్టీ అధ్యక్షులు ఆసోది సుబ్బారెడ్డి మరియు యూనియన్ బ్యాంక్ ఉప్పుగుండూరు ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈమెకు యూనియన్ బ్యాంక్ ఉప్పుగుండూరు వారి సహకారంతో ఇవ్వడం జరిగింది. ఈ స్కీం లో లక్షకి 35000 చొప్పున సబ్సిడీ కింద తీసివేయడం జరుగుతుంది మరియు పెదగంజాం అనేది చాలా పెద్ద గ్రామం ఈ గ్రామం కింద నాలుగైదు గ్రామాలు వారు కారం గాని పిండి గాని పట్టించుకోవాలంటే ఉప్పుగుండూరు గాని చిన్నగంజా గాని వచ్చి పట్టించుకోని వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఇదే గ్రామంలో ఈ మిషన్ ఇవ్వటం వల్ల ఒక కుటుంబానికి జీవనోపాధి వస్తుంది మరియు ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది చాలా సంతోష కార్యక్రమoఈ ఈ కార్యక్రమంలో సిసి వెంకటస్వామి వివోఏ ఈశ్వరమ్మ మిగిలిన వివోఏలు పాల్గొనడం జరిగింది








