
Eluru:పోలవర: అక్టోబర్ 29:- మొంథా తుఫాన్ ప్రభావంతో పోలవరం మండలం బీసీ కాలనీ (చుట్టుకుంట చెరువు ప్రాంతం)లో నీరు నిలిచిపోయింది. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ & పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు స్వయంగా పర్యటించారు.గ్రామస్తులు ఆయనతో మాట్లాడుతూ — “కాలనీ మొత్తం నీటమునిగి, చిన్నపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం” అని తెలియజేశారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు తక్షణ చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ జి. ప్రభాకర్ కు సూచించారు.
దీనికి స్పందించిన స్పెషల్ ఆఫీసర్ జి. ప్రభాకర్, మోటార్ ఇంజిన్ల సహాయంతో నీటిని దిగువ ప్రాంతాలకు పంపే చర్యలు ప్రారంభించాలని తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాస్ బాబు, రవి కుమార్, నలం గాంధీ, నీటి సంఘం అధ్యక్షులు పాదం ప్రసాద్, జనసేన నాయకులు చిన్ని, మంగిన వెంకటరమణ, నల్ల రాంబాబు, వార్డ్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







