
పోలవరం, అక్టోబర్ 12:ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం మహమ్మారి లాంటి భయంకర పరిస్థితిని తీసుకువచ్చిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అక్టోబర్ 13న సోమవారం ఉదయం 9:30 గంటలకు పోలవరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తెల్లం బాలరాజు హాజరవుతారు. అదనంగా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు సభ్యులు సహా పార్టీకి చెందిన వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయిప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం, నకిలీ మద్యం తయారీకి అనుకూల వాతావరణం కల్పించడం దారుణమని, దీనిపై ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే ఈ నిరసన చేపడుతున్నట్లు నేతలు పేర్కొన్నారు.







