
బాపట్ల: పర్చూరు: చిన్నగంజాం:29-10-25:- చిన్నగంజాం మండలం పరిధిలో బుధవారం ఉదయం సాహసోపేతంగా ఇద్దరు పోలీస్ సిబ్బంది ప్రాణాలను కాపాడిన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే— ఉదయం సుమారు 7 గంటల సమయంలో, ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ నుంచి డ్యూటీ ముగించుకొని ఉప్పుగుండూరు వైపు బైక్‌పై వెళ్తున్న రైల్వే ట్రాక్‌మెన్ గణేష్, బాలాజీ రెడ్డిలు ఉప్పుగుండూరు–నీలాయపాలెం మధ్య రైల్వే ట్రాక్ పక్కనే నీటి వరద ప్రవాహంలో చిక్కుకున్నారు.

నీటి తీవ్రత ఎక్కువగా ఉండడంతో బైక్‌తో సహా కొట్టుకుపోతున్న సమయంలో, రైల్వే అండర్‌పాస్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అన్సార్ భాష, శివశంకర్ రెడ్డిలు వెంటనే అప్రమత్తమై తాడు సహాయంతో నీటిలోకి దిగి వారిని సురక్షితంగా కాపాడారు.

సమయోచితంగా స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీస్‌ల ధైర్యసాహసాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వీరిని అభినందిస్తూ, వారి సేవాస్ఫూర్తిని కొనియాడారు. స్థానికులు కూడా పోలీస్‌లకు ధన్యవాదాలు తెలిపారు.







