
పవన్ కళ్యాణ్ పై విమర్శలు, విన్నకోట ఘాటైన స్పందన

బాపట్లలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో, పార్టీ నాయకులు విన్నకోట సురేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాని వేదికగా చేసుకొని దాడి చేయడం ఏమిటి అని వైఎస్ఆర్సిపి నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. 2000లో ఉన్న 76 ఎకరాల భూమి ఈరోజు 103 ఎకరాలకు ఎలా పెరగిందని, భూకబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చ లేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు.
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా తయారయ్యే లడ్డూ నేతిలో కల్తీ జరిగిందని వచ్చిన నివేదికలను ప్రస్తావించి, మతపరమైన రాజకీయాలు చేయడాన్ని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన జీతాన్ని ప్రతినెల తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి జీవనోపాధి చదువుల కోసం విరాళంగా ఇస్తున్నారని విన్నకోట సురేష్ వివరించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ ఆంధ్రా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి కుటుంబాన్ని భూ కబ్జా వ్యవహారంలో హెచ్చరించారన్నారు. పవన్ కళ్యాణ్ యథార్థ రాజకీయ నాయకుడిగా, అవినీతి మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతికి తావివ్వకుండా, పాలనని చేస్తున్నారు, గతంలో మీరు చేసిన తప్పులు వల్లే ప్రజలు 11 స్థానాలు మాత్రమే కేటాయించడమే మీ చర్యలకు ఫలితంగా జరిగింది, అని తెలిపారు. మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నేతలు, అభిమానులు పాల్గొన్నారు.







