
పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం:-మండలం పరిధిలోని పొంగుటూరు గ్రామంలో కేఎస్ఆర్ రైస్ మిల్ నిర్మాణం పూర్తి కావడంతో శనివారం నాడు ఆ మిల్లును ఘనంగా ప్రారంభించారు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు. ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మిల్లును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి మిల్లులు ఎంతో దోహదపడతాయి. రైతులకు న్యాయమైన మద్దతు ధరలతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రైస్ మిల్ కీలకపాత్ర పోషిస్తుంది,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కూటమి పార్టీల మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







