
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలోని తుంగభద్ర కట్టపైన నివసిస్తున్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నం, కూరగాయలను పంపిణీ చేశారు. Ponnuru news:పొన్నూరులో తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

పంపిణీ కార్యక్రమంలో మిత్రమండలి జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు యన్నం నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచనలతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

మొంథా తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తుంగభద్ర కట్ట ప్రాంతంలో నివసిస్తున్న 250 పేద కుటుంబాలకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య, బిజెపి పట్టణ అధ్యక్షుడు గోవాడ వెంకట కృష్ణరావు, పచ్చల తాడిపర్రు సొసైటీ చైర్మన్ గంధం సురేంద్ర, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎలవర్తి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మళ్లీబోయిన గోపికృష్ణ, తోట నాగరాజ్, మిరియాల చంద్రకాంత్, మండల జనసేన నాయకులు గరికపాటి చిన్నారి, పోకల సుధాకర్ మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







