
ponnuru:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మందా సాల్మన్ గారిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనకు నిరసనగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అంబటి మురళీకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద గల డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి మృతుడికి ఘన నివాళులు అర్పించి, దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.
నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందా సాల్మన్ హత్య దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.Guntur news today telugu #gunturnews #ponnuru #tenali #mangalagiri #tadikonda #prathipadu
ఈ నిరసన కార్యక్రమంలో పొన్నూరు పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గేరా సంజీవ్ గారు, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఫోనుగుపాటి పాల్ రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు గారు, పొన్నూరు మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కూచిపూడి మరియరాణి గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మండ్రు అనిత గారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మౌలాలి గారు పాల్గొన్నారు.
అలాగే మండల కార్మిక విభాగం అధ్యక్షులు రుద్రపాటి నాగేశ్వరరావు గారు, నియోజకవర్గ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షులు చిర్రా అక్కిరెడ్డి గారు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ పీరు గారు, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కారుమూరి అంకమ్మ రావు గారు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పలగాని రమేష్ గారు, జిల్లా ఎస్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ గోపీ గారు, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇమ్మానియేల్ గారు పాల్గొన్నారు.
ఇంకా పట్టణ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మిక్కిలి జాన్ గారు, పట్టణ బూత్ కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి వాసు గారు, పచ్చలతాడిపర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లెద్దు డేవిడ్ గారు, మునిపల్లె గ్రామ నాయకులు దేవరపల్లి వరకుమార్ గారు, వివిధ గ్రామాల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










