Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

vijayawada local news:పోరాడి జీతాలు సాధించుకున్న అంబేద్కర్ స్మృతి వనం కాంటాక్ట్ కార్మికులు

విజయవాడ, నవంబర్ 2:-ఎన్.టి.ఆర్ జిల్లా కేంద్రంగా ఉన్న అంబేద్కర్ స్మృతి వనంలో కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాల పోరాటానికి ఫలితం దక్కింది. సిఐటియు ఆధ్వర్యంలో 30 రోజుల పాటు కొనసాగిన నిరసనల అనంతరం ఆర్కే సర్వీస్ ఏజెన్సీ 21 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 9 లక్షల రూపాయల జీతాలు విడుదల చేసింది. తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాల నుంచి ఆరు నెలల వేతనాలను ఇప్పిస్తామని, మిగిలిన జీతాలను నెల రోజుల్లో చెల్లిస్తామని కాంట్రాక్టర్ అంగీకరించారు.ఈ సందర్భంగా సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె. దుర్గారావు దీక్షను విరమణ చేయించగా, కార్మికులకు నిమ్మరసం ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

దోనేపూడి కాశీనాథ్, ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ –
డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తొమ్మిది నెలలుగా వేతనాలు అందుకోక కష్టాలు పడుతున్నారని, సిఐటియు నాయకత్వంలో వారు బిక్షాటన, నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలు, సాంస్కృతిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళనలు, ప్రజా వేదికల్లో అర్జీలు సమర్పించడం వంటి పలు రూపాల్లో పోరాటం చేపట్టారని తెలిపారు.ఆర్కే సర్వీసెస్ ఏజెన్సీ ప్రతి నెల జీతాలు ఇస్తామని చెప్పి పనిలో పెట్టుకున్నా, పని చేసిన కాలానికి కూడా వేతనాలు ఇవ్వక కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో 30 రోజుల నిరంతర పోరాటం ఫలితంగా కార్మికులకు ఆరు నెలల జీతాలు అందించగలిగామని తెలిపారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంఘటిత రంగం, కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని వారు వ్యాఖ్యానించారు. లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని, పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.మిగిలిన మూడు నెలల పెండింగ్ వేతనాలు కూడా తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల హాజరుకు సంబంధించి ఎటువంటి అన్యాయం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కార్మికుల హక్కులు, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి హామీల కోసం సిఐటియు చేపట్టే ప్రతి పోరాటంలో పాల్గొని విజయం సాధించాలని కార్మికులను కోరారు.కార్యక్రమంలో సిఐటియు నాయకులు క్రాంతికుమార్, యం.బాబురావు, వై.సుబ్బారావు, ఎం.సోమేశ్వరరావు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు పి.సునీత, పి.విజయ్ కుమారి, పి.మేరీ, ఎం.సుజాత, యం.దీపిక, కె.అనూష, పి.సత్యవతి, కె.ధనలక్ష్మి, సి.హెచ్.మల్లిక, కె.హరిత, ఎల్.తేరోజమ్మ, ఎస్.కె.జుబేదా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button