

చీరాల N.R.& P.M హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న హిందూ సమ్మేళనం కి ముఖ్య అతిథిగా విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
Hindu Sammelan హిందువులను సంఘటితం చేసి సమాజంలో సమరసతను పెంపొందించేందుకు, స్వదేశీ భావనను బలపరచేందుకు, కుటుంబ విలువలను కాపాడేందుకు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు, అలాగే పౌరుడిగా ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తుచేసేందుకు ఈ హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

“మార్పు నా నుంచి – నా ఇంటి నుంచే ప్రారంభమైతే, అదే మార్పు సమాజం మొత్తాన్ని, దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. మన పవిత్ర మాతృభూమిని తిరిగి విశ్వగురు స్థాయికి తీసుకెళ్లే దిశగా ఈ హిందూ సమ్మేళనం కీలకంగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఈ హిందూ సమ్మేళనం సమాజ ఐక్యతకు, హిందూ ధర్మ విలువల పరిరక్షణకు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే వేదికగా నిలవనుందని తెలిపారు.








