
తాడేపల్లి:-ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమరభేరి కార్యక్రమం శుక్రవారం తాడేపల్లిలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలు తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.
ఈ వాహనాలను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, లోక్ భవన్‌కు పంపించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారుGuntur Local News :ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవం.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ఉద్యమం కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.







