Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

prabhuthava medical ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా.. కోటి సంతకాల సేకరణ ప్రారంభించిన వైసీపీ

NTR విజయవాడ: 17-10-25:- విజయవాడతూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్‌లో శుక్రవారం రోజున కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవుని అవినాష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడమే ఈ సంతకాల సేకరణ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేశారని అన్నారు.అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దాంతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారుకోటి సంతకాల సేకరణ అనంతరం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌ను స్వయంగా కలిసి ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తారని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button