Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ మేనిఫెస్టో విడుదల

విజయవాడ, అక్టోబర్ 12:ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం రూపొందించిన మేనిఫెస్టోను ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో సొసైటీ అధ్యక్షులు గౌరి మణి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు న్యాయవాదుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే ఈ మేనిఫెస్టోను రూపొందించాం,” అని తెలిపారు.

మేనిఫెస్టోలో ప్రధాన హామీలు ఇవే:

  1. ఆరోగ్య భీమా: ప్రతీ న్యాయవాది కుటుంబానికి రూ. 3 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.
  2. రీఫండ్ విధానం: 35 ఏళ్లు దాటిన న్యాయవాదులు వెల్ఫేర్ ఫండ్ సభ్యత్వం కోసం రూ. 20,000/- పైగా చెల్లించి ఉంటే, అదనంగా చెల్లించిన మొత్తంలో 50% తిరిగి చెల్లింపు.
  3. కొత్త సభ్యత్వ అవకాశం: వెల్ఫేర్ ఫండ్‌లో సభ్యత్వం లేని వారికి మరోసారి సభ్యత్వం పొందే అవకాశం కల్పించబడుతుంది.
  4. గ్రాటిట్యూటీ & పెన్షన్: 70 ఏళ్లు దాటిన లేదా వృత్తి నుండి వైదొలిగిన న్యాయవాదులకు రూ. 8 లక్షల గ్రాటిట్యూటీ లేదా నెలకు రూ. 8,000 పెన్షన్. మరణించిన తర్వాత కుటుంబానికి రూ. 10 లక్షలు.
  5. వృత్తి కొనసాగించలేని వారి కోసం: అనారోగ్యం వల్ల వృత్తి చేయలేని న్యాయవాదుల కుటుంబాలకు నెలవారీ పెన్షన్.
  6. మరణాంతర ప్రయోజనాలు: న్యాయవాది మరణించినపుడు నామినీకి రూ. 20 లక్షలు. న్యాయవాది లేదా వారి భార్యా భర్త మరణించినపుడు మట్టి ఖర్చులకు రూ. 20,000 వెంటనే అందచేయడం.
  7. చట్టాలు & కాలనీ ఏర్పాటు: న్యాయవాదుల కుటుంబాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో న్యాయవాదుల కోసం కాలనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకోవడం.
  8. ఈ సమావేశంలో రాష్ట్ర సొసైటీ ప్రెసిడెంట్ అద్దంకి మనిబాబు, వైస్ ప్రెసిడెంట్ పిల్ల రామయ్య, అంబేద్కర్ జిల్లా ప్రెసిడెంట్ నందిత కళ్యాణి, భీమవరం బార్ వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్.వి సూర్యనారాయణ, సలహాదారులు తారకేశ్వరరావు, కొప్పిశెట్టి శేషగిరిరావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button