chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:-ప్రధాని పర్యటనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది: ప్రత్తిపాటి

Guntur:పత్తిపాడు:14-10-25:-ఈ నెల 16న కర్నూలులో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో మరియు బహిరంగ సభను ఘనవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూడుపార్టీల కూటమి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే డాక్టర్ ప్రత్తిపాటి పుల్లారావు.సోమవారం పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంకుమార్ (శ్యాంబాబు), ఇతర నేతలతో కలిసి సమావేశమైన ఆయన, మోదీ పర్యటనను జాతీయ స్థాయిలో ప్రదర్శనగా మలచేందుకు కూటమి శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. “వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి, పార్టీ ఆదేశాలకు కట్టుబడి, రోడ్ షోను దేశం గర్వించే స్థాయిలో విజయవంతం చేయాలి,” అని పుల్లారావు పిలుపునిచ్చారు.

“చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తున్నారు”

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం మధ్య సైతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించిన పుల్లారావు, “దేశంలో ఎవరికీ సాధ్యం కానివి, మన ముఖ్యమంత్రి ప్రజలకు అందిస్తున్నారు. దీని పట్ల మూడుపార్టీల శ్రేణులు గర్వించాలి,” అని వ్యాఖ్యానించారు.స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, మెగా DSC, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో పాటు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లు అందించడంలో రాష్ట్రం ముందుందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు రూ.440 కోట్లు పంపిణీ చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, త్వరలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేయనున్నారని తెలిపారు.

“పస్తులుంచరు.. మంచి విందుభోజనమే పెడతారు”

“తనను నమ్మి కృషి చేసిన టీడీపీ శ్రేణులకు చంద్రబాబు, లోకేశ్‌లు మంచి విందుభోజనం పెడతారు గానీ, పస్తులుంచరు,” అంటూ కార్యకర్తలకు భరోసానిచ్చారు. కూటమి పార్టీల శ్రేణులు ప్రజల నాడిని అర్థం చేసుకుంటూ పని చేయాలని, అప్పుడే రాజకీయంగా నిలదొక్కుకోవచ్చని పుల్లారావు హితవు పలికారు.సమావేశంలో పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంకుమార్, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ, బీజేపీ, జనసేన కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker