
Chirala Local News :ప్రజా దర్బార్ కార్యక్రమం లో పాలుగోన్నా-చీరాలఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యనిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు హాజరై ప్రజల నుంచి ప్రత్యక్షంగా వినతులు, అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ— ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి తక్షణ చర్యలు చేపట్టే వేదికగా ప్రజా దర్బార్ నిలుస్తుందని పేర్కొన్నారు. మొత్తం 261 పైగా అర్జీలు స్వీకరించగా, వీటిలో ఇంటి నిర్మాణాలు, ఇంటి స్థలాలకు 220, పింఛన్‌లకు 29, అలాగే వివిధ సమస్యలకు సంబంధించిన 12 అర్జీలు అందినట్లు తెలిపారు.

కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతువరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.







