chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Machilipatanam Local News :-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ నిర్వహణ–– జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, ఫిబ్రవరి 01, 2026:– ఈ నెల 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

ప్రజలకు పాలన మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అర్జీదారులు తమ సమస్యలను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని సూచించారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు అర్జీ స్థితిని కూడా తెలుసుకోవచ్చన్నారు.మచిలీపట్నంలో జనసేన నేత సస్పెన్షన్ కలకలం||JanaSena Leader Suspension Creates Stir in Machilipatnam

అదేవిధంగా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు నమోదు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker