
బాపట్ల :28-11-25:-పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్–సీవీఏపీ (P-4) కార్యాలయ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్–గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిర్యాదులు, వినతులు, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే ఎదుట ప్రస్తావించారు.

ప్రజల తరఫున వచ్చిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని వెంటనే సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశించారు. ప్రజా సమస్యలపై శీఘ్ర స్పందనకు, వాటి పరిష్కారంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణకు అధికారులకు సూచనలు జారీ చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలనను బలోపేతం చేయడమే ప్రజా దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.







