
అమరావతి: నవంబర్ 10:-ప్రజాకవి అందెశ్రీ గారి మృతి పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” వంటి హృదయాన్ని తాకే పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలను సృష్టించిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను” అని లోకేష్ పేర్కొన్నారు.
సాహిత్య రంగానికి అందెశ్రీ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం తెలుగు సాహిత్య ప్రపంచానికి అపార నష్టం అని తెలిపారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.







