బాపట్ల, సెప్టెంబర్ 25:గురువారం, చీరాలలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ కూరగాయల మార్కెట్ కూడలి నుండి క్లాక్ టవర్ వరకు రోడ్లను శుభ్రపరచి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇల్లు, ప్రతి వీధి శుభ్రంగా ఉండాలని ఆయన తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని ఆయన తెలిపారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించాలని ఆయన తెలిపారు. చెట్లను పెంచటం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అని ఆయన అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా వస్త్రంతో తయారుచేసిన సంచులను మాత్రమే వాడాలని ఆయన అన్నారు. నెహ్రూ కూరగాయల మార్కెట్ నుండి క్లాక్ టవర్ వరకు ఉన్నటువంటి ప్రతి షాపును ఆయన తనిఖీ చేశారు. షాపులో ప్లాస్టిక్ వాడకం ఉందా లేదా అని షాపు యజమానులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ బాపట్ల జిల్లా దిశగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. అనంతరం క్లాక్ టవర్ కూడలిలో ఏర్పాటుచేసిన మానవహారంలో పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో చీరాల రెవిన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, చీరాల తహసిల్దార్ గోపికృష్ణ, చీరాల రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు తదితరులు పాల్గొన్నారు.బాపట్ల జిల్లా రాష్ట్రంలో టాప్ 3 లో ఉండాలి – కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్