
గుంటూరు: నవంబర్ 10:*జిల్లా ప్రజల నుంచి వివిధ శాఖలకు అందిన ఫిర్యాదులను దరఖాస్తుదారుల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
మొత్తం 261 ఫిర్యాదులు వివిధ శాఖలకు అందగా, వాటి పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం ఎండార్స్‌మెంట్‌లు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.అధికారులు ముఖ్యమైన అంశాలపై తక్షణంగా స్పందించాలని, పెండింగ్‌లో ఉన్న సి.ఎం.ఓ. గ్రీవెన్స్‌లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఏ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, ఏడీ మైక్రోఇరిగేషన్ వజ్రశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చక్రవర్తి, కలక్టరేట్ ఈఓ పూర్ణ చంద్రరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.







