chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

REPALLE LOCAL NEWS:ప్రజల వద్దకే పరిపాలన- రేపల్లె పి.జి.ఆర్.ఎస్ లో 238 అర్జీల స్వీకరణ

రేపల్లె, మార్చి 23: ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రేపల్లె మండల కేంద్రంలోని పత్తిపాటి సీతారామ యోగిని & పాలాటి రాజ్యలక్ష్మి స్మారక కళ్యాణ మండపంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ భావన, డి.ఆర్.ఓ గంగాధర్ గౌడ్‌లతో కలిసి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతులను స్వీకరించారు.

Gilla Collectorate lo

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి రాలేని దూర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం ఒక రెవెన్యూ డివిజన్ లేదా నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి కార్యక్రమంలో మొత్తం 238 అర్జీలు అందాయని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నెల రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 24 నుండి 48 గంటల్లో పరిష్కరించాల్సిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ రెవెన్యూ సమస్యల కోసం గ్రామ సచివాలయాల్లో చలానా చెల్లించి సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావు, డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ విజయమ్మతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker