
బాపట్ల జిల్లా:25-12-2025:- ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమ, శాంతి, కరుణ, సోదరభావం వంటి విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన యేసుక్రీస్తు జన్మదినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే మీడియా మిత్రులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.Bapatla Local News
క్రిస్మస్ పండుగను ప్రజలందరూ ఆనందంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.










