
గుంటూరు:23-10-25:- గుంటూరుమున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నగర అభివృద్ధి పనులపై ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడ ఎంత ఖర్చు జరుగుతుందో ఎవరికి తెలియదు. మొక్కల నాటడం కోసం 55 లక్షలు అన్నారు, ఇంకొక పనికి 80 లక్షలు అన్నారు, కానీ లెక్కలు స్పష్టంగా లేవు. డీసిల్టేషన్ పనుల బిల్లులు చెల్లించటం లేదు.
కొన్ని పనులు పూర్తికాకపోయినా బిల్లులు క్లియర్ అవుతున్నాయి. నా నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల వర్కులు జరిగితే, ఇప్పటివరకు కేవలం రెండు కోట్ల రూపాయలకే బిల్లులు క్లియర్ అయ్యాయి. మిగతా నిధుల పరిస్థితి తెలియదు, అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులుగా ఖర్చుల వివరాలు తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తూ, “మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. పేపర్ల ద్వారానైనా, లేక పోర్టల్ రూపంలో అయినా నగరంలో ఎక్కడ ఎంత నిధులు ఖర్చవుతున్నాయో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మూడొందల మంది కాంట్రాక్టర్లు ఇప్పటికీ పోర్టల్‌లో నమోదు కాలేదు. కొందరికి ఆమోదం రాలేదు, ఇంకొందరికి బిల్లులు స్టేజీలోనే నిలిచిపోయాయన్నారు. ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్తుందో, తెలియాలని, మనం ప్రజలకు జవాబుదారితనంగా, ఉండాలని తదుపరి కౌన్సిల్ సమావేశానికి ముందే ఆదాయం, ఖర్చు, వర్కుల వివరాలను పూర్తి పారదర్శకతతో సభ ముందుంచాలని గళ్ళా మాధవి డిమాండ్ చేశారు.







