
సికింద్రాబాద్ కంటోన్మెంట్ : 03-11-25:-మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్‌పల్లి అడ్డుకట్ట ప్రాంతంలో ఉన్న భారీ గుట్ట రాళ్లలో పగుళ్లు ఏర్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణమైనా రాళ్లు కూలిపోవచ్చన్న ఆందోళనతో ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలతో కలిసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న గుట్ట రాళ్లను గమనించిన ఆయన, అక్కడినుంచే జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన రాళ్లను తొలగించి, పరిసర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ – “ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం. ఎవరూ భయపడవద్దు. తగిన చర్యలు వెంటనే తీసుకుంటాం” అన్నారు.ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, వెంకట స్వామి, ముత్యాలు, రాములు తదితరులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.
 
 






