విజయవాడ, అక్టోబర్ 10:ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఏలూరు రోడ్డులోని ఐఎంఎ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తులసి మొక్కకు నీరు పోసి మంత్రి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం “మానసిక ఆరోగ్యానికి నడక” అనే కార్యక్రమానికి జెండా ఊపి ఆరంభం చేశారు.
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ శా, ఏపిఎంసి ఛైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజృంభంగా కొనసాగింది.