
ప్రజా హితం కోసం ఉపయోగపడేలా వార్తలు రాయాలని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ ఆలపాటి సరేశ్ కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో రెండురోజుల పునశ్చరణ తరగతులను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ నిబద్ధత, నేర్చుకోవాలన్న తపన విలేఖరులకు వుండాలని సూచించారు . జర్నలిజం వృత్తి లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగేందుకు ఎంతో నిబద్ధత కలిగివుండాలని ఆయన సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాత్రికేయ వృత్తిలో రాణించాలని కోరారు. APUWJ 36th State convention to be held in Ongole 2025 June 24, 25, and 26: :ఎపియుడబ్లూజే రాష్ట్ర మహాసభలు
రెండు రోజుల శిక్షణ కార్యక్రమాల్లో తొలిరోజు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ కుర్రా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) పై తొలి ప్రసంగాన్ని చేశారు ప్రస్తుత ఆధునిక పరిస్థితులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత అన్ని రంగాల్లోనూ పెరుగుతూ పోతుందన్నారు వైద్యులు ఇంజనీర్లు పరిశోధకులతో సహా అన్ని రంగాల్లోనూ AI ని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు పత్రికారంగంలో చాట్ జిపిటి, పర్ఫ్లెక్స్ సిటీ, గూగుల్ జెమిని వంటి యాప్ లు వినియోగించడం ద్వారా పాత్రికేయులు తమ సమయాన్ని ఆదా చేసుకోగలరు అన్నారు. కావలసిన కంటెంట్ ఇమేజ్ వీడియోలను ఈ యాప్ ల ద్వారా పొందవచ్చు అన్నారు అతి తక్కువ సమయంలో మనకు అవసరమైన కంటెంట్ తో పాటు చిత్రాలు వీడియోలు రూపొందించుకోవడం జరుగుతుందన్నారు
అయితే వీటికి సరైన రీతిలో ఇన్ పుట్స్ ఇవ్వడం ద్వారా కరెక్ట్ అవుట్ పుట్ ను పొందవచ్చు అన్నారు రచనలు రాయడం, భాష మార్చడం, ఫోటోలు వీడియోలను రూపొందించడం డేటాను చూడడం వంటి పనులు చేయవచ్చనారు నోట్ ప్యాడ్ ఎల్ ఎం ద్వారా సమాచారాన్ని కావలసిన రీతిలో రూపొందించుకోవచ్చు అన్నారు ఏది అడిగినా ఇవ్వడానికి AI సిద్ధంగా ఉందని అడగ గలిగే సామర్థ్యాన్ని పాత్రికేయులు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు అయితే ఈ సమాచారం అంతా సామాజిక శ్రేయస్సుకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం ముఖ్యం అన్నారు. Guntru news :డిప్యూటీ డైరెక్టర్ రమేష్‌కు APUWJ నాయకుల అభినందనలు అనంతరం ఆంధ్రజ్యోతి అనంతపురం ఎడిషన్ ఇంచార్జ్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం ఉద్యోగం కాదని వృత్తి అని పేర్కొన్నారు వేసే ప్రతి అడుగులో వ్యవస్థలో లోపాన్ని ఎత్తి చూపడం ద్వారా సామాజిక అభ్యుదయానికి కట్టుబడి ఉండాలని సూచించారు వార్తలకు సమాచార సేకరణ చేసేందుకు సమాజంలోని మనుషులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. వార్తలను సరైన సమయంలో ప్రాధాన్యతా క్రమంలో పంపడం ద్వారా డెస్క్ జర్నలిస్టులకు కొంత మేర సౌలభ్యం కలిగించవచ్చు అన్నారు ప్రతి వ్యక్తి తమకు నమ్మకమైన వ్యక్తితో సమాచారం పంచుకోవడానికి ఇష్టపడతారని ఆయన తెలిపారు. వార్త సేకరణలో యాంత్రికంగా పని చేయకూడదని ప్రజలతో కలిసి పోవాలని ఆయన సూచించారు వార్త లోని అంశాలను సరైనవో కాదో ధ్రువీకరించుకోవాలని ఆయన పేర్కొన్నారు ఒక వార్తకు సంబంధించిన అంశాన్ని తరువాత ఫాలోఅప్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలని సూచించారు. డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ సంఘటనా స్థలాన్ని సందర్శించి రాసే వార్తలు ప్రజల మన్ననలు పొందుతాయన్నారు మండల విలేఖరులు వారానికి ఒక్క రోజైనా విధిగా రెండు గ్రామాల్ని సందర్శించి ప్రజల సాధకబాధకాలు తెలుసుకోవాలని సూచించారు టెక్నాలజీ వల్ల వార్తల్లో వేగం పెంచవచ్చని అయితే వార్తల్లో నిజానిజాలను మానవమేద మాత్రమే గుర్తించగలరని ఆయన అన్నారు ప్రశ్నించడం అనేది విలేఖరుల హక్కుగా గుర్తించాలని అది వారి వ్యక్తిత్వంలో భాగమైపోవాలని ఆయన సూచించారు జర్నలిజంలో తగ్గిపోతున్న విలువల్ని కాపాడే ధైర్యాన్ని ప్రతి ఒక్క పాత్రికేయుడు కలిగి ఉండాలని ఆయన సూచించారు ఈ పునశ్చరణ తరగతులకు సి ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు







