
ప్రతి సంవత్సరం దసరా పండగ సమీపిస్తున్నప్పుడు, ప్రొద్దుటూరు పట్టణం ప్రత్యేకంగా వెలుగొందుతుంది. ఈ ఊర్లో జరిగే దసరా సంబరాలు, స్థానికుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయడానికి, దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ ‘ప్రొద్దుటూరు దసరా’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ నటుడు మహేష్ విట్టా నటించారు.
డాక్యుమెంటరీని బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ప్రదర్శనకు ప్రముఖులు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం, దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, “ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ఈ ప్రొద్దుటూరు దసరా ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది” అని పేర్కొన్నారు.
మహేష్ విట్టా మాట్లాడుతూ, “ప్రొద్దుటూరు దసరాని అందరి ముందుకు తీసుకు వచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. మా ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెబుతుంటాను. పది రోజుల పాటు పండుగ అదిరిపోతుంది. ఈ డాక్యుమెంటరీలో చూపించిన దాని కంటే ఇంకా బాగుంటుంది. పది టెంపుల్స్‌లో దసరా గొప్పగా జరుగుతుంది. 11 వ రోజు మాత్రం వాహనాలు కూడా వచ్చే స్థలం ఉండదు. శివ కాశీ నుంచి తెచ్చిన క్రాకర్స్‌ని గంట సేపు కాల్చుతారు. ప్రొద్దుటూర్‌లో దసరా అద్భుతంగా జరుగుతుంది” అని అన్నారు.
ఈ డాక్యుమెంటరీలో యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. ఆర్ఆర్ పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐని వాడుకుని గొప్పగా చూపించారు. ఇంటర్నేషనల్ వైడ్‌గా డాక్యుమెంటరీలను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తుంటారు. డాక్యుమెంటరీ అనేది దృశ్యరూపంలో ఉండే చరిత్ర. ప్రొద్దుటూరు దసరాని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్ అని అన్నారు.










