
అమరావతి: డిసెంబర్ 9:-రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పూర్వోదయ పథకాన్ని ప్రధానంగా వినియోగించేందుకు ప్రభుత్వం దూకుడు పెంచింది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పూర్వోదయ పథకం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరంగా పరిశీలించారు.రాయలసీమ – ప్రకాశం జిల్లాల్లో భారీ ప్రణాళికలుపూర్వోదయ పథకం కింద అందనున్న నిధులతో మొత్తం 82 క్లస్టర్లను ఉద్యాన పంటల కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు.20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు విస్తరించేలా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.పథకం కింద రూ.40 వేల కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.రూ.20 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకురూ.20 వేల కోట్లు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేటాయించాలన్నారు.ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూ.5 వేల కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టి, జాతీయ–రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సూచించారు.తేకాదు, 23 ప్రధాన–మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, 1,021 చెరువుల పూర్తి ద్వారా ఉద్యాన పంటలకు తగిన నీటి అందుబాటు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు.పోలవరం–నల్లమల సాగర్‌పై కీలక నిర్ణయంసమీక్షలో మరొక అంశంగా పోలవరం–నల్లమల సాగర్ అనుసంధానం చర్చకు వచ్చింది.
ఈ మెగా ప్రాజెక్టుకు రూ.58,700 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించారు.ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుంది.మరో 6 లక్షల ఎకరాల స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీల నీటి కేటాయింపు సాధ్యమవుతుందని తెలిపారు.పోలవరం నుంచి 200 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 50 టీఎంసీల వరదజలాలను బొల్లాపల్లి–నల్లమల సాగర్‌కు తరలించే ప్రణాళిక రూపొందించాలన్నారు.ఈ పనులను త్వరితగతిన ప్రారంభించాలంటూ సీఎం ఆదేశించారు.ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు ఊపుఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఇందుకోసం రూ.5 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఈ ప్రాంతం ఆయిల్ పామ్, ఉద్యాన పంటలకు అనువైన ప్రాంతం కావడంతో, విస్తృత ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నేచురల్, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.దనంగా, రూ.169 కోట్లతో వంశధార–నాగావళి–చంపావతి నదుల అనుసంధానం చేపట్టాలని నిర్ణయించారు. హిరమండలం రిజర్వాయర్, నారాయణపురం ఆనకట్టల అనుసంధానంతో 5 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.







