
Hyderabad:మేడ్చల్–మల్కాజగిరి:30-11-25:- నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో పార్కులు కాపాడినందుకు చిన్నారులు ప్రత్యేక ధన్యవాద ర్యాలీ నిర్వహించారు. కాకతీయ కాలనీలో ఉన్న 600 గజాలు, 1500 గజాల రెండు పార్కులను రక్షించడంలో హైడ్రా చేసిన సహాయానికి గుర్తింపుగా చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని భారీగా పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా పిల్లలు “హైడ్రా జిందాబాద్” అంటూ నినాదాలు చేయడంతో ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా మారింది.
“మాకు ఆడుకునే స్థలం దొరికింది… పార్కులు మా కోసం కాపాడారు” అంటూ చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. పచ్చదనాన్ని కాపాడుకోవడంలో మా వంతు బాధ్యత పూర్తి చేస్తామని, మొక్కలు నాటి పార్కులను జాగ్రత్తగా సంరక్షిస్తామని వారు మాటిచ్చారు.హైడ్రా జోక్యంతోనే ఈ పార్కులు రక్షించబడ్డాయంటూ చిన్నారులు, కాలనీవాసులు ర్యాలీ దారితప్పకుండా నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగించారు.







