
Bapatla:చీరాల:బుర్రవారిపాలెం;26-11-25:-చీరాల మండలంలోని బుర్రవారిపాలెం గ్రామంలో “రైతన్న! మీ కోసం” కార్యక్రమం భాగంగా ఈరోజు ఎమ్మెల్యే యం.యం. కొండయ్య గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతులను ఆత్మీయంగా కలిసి పంటల మార్పిడి పద్ధతులపై అవగాహన కల్పించారు.రైతులు సంప్రదాయ పంటలతో పాటు డిమాండ్ ఆధారిత పంటలైన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటి వినియోగం తక్కువగా ఉండే ఈ పంటలు రైతులకు ఆదాయాన్ని పెంచడమే కాకుండా మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు టి. రత్నకుమారి, ఏఓ నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె. జనార్దనరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు దోగుబర్తి సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు గంజి పురుషోత్తం, మాజీ ఎమ్మెస్సీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జ్ నక్కల శ్రీను, నరాల తిరుపతి రాయుడు, బొంతగొర్ల రాధ మరియు గ్రామ పార్టీ నాయకులు బుర్ల రాంబాబు, బొంతగొర్ల వెంకటేశ్వర్లు, బుర్ల వెంకటేశ్వర్లు, మల్లారపు ఏసురత్నం, వెంకట్ రెడ్డి, షేక్ సాజిత్, కర్రెద్దుల వంశీ, యర్రవరపు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, సూచనలు తెలుసుకుంటూ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు, వ్యవసాయ విధానాలను ఎమ్మెల్యే వివరించారు.







