
బాపట్ల : చెరుకుపల్లె:29-11-2025:-రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లె మండలం నడింపల్లి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మంతనాలు జరిపి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ భావన కీలకంగా పాల్గొన్నారు. కొనుగోలు కేంద్ర నిర్వహణ, బరువు ప్రమాణాలు, ధాన్యం నాణ్యత పరిశీలన, రైతులకు కల్పిస్తున్న సేవలపై అధికారులు వివరాలు అందించారు.ఈ సందర్బంగా రేపల్లె ఆర్‌డీโอ వై. రామలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం.వి. శ్రీలక్ష్మి, డీఎస్ఓ బాషా, ఇంచార్జి వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణ, మండల తహశీల్దార్ చి.హెచ్. పద్మావతి, ఎంపీడీవో మహబూబ్ సుబాని తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.







