
బాపట్ల, జనవరి:-బాపట్ల జిల్లా నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రాం (NTEP) మరియు ప్రధానమంత్రి టిబి ముక్త భారత్ అభియాన్ (PMTBMBA) కార్యక్రమంలో భాగంగా రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో టిబి రోగులకు 200 పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా గౌరవ ఎంపీ శ్రీ టి. కృష్ణ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా, జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డా. వి. వినోద్ కుమార్ గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. విజయమ్మ గారు, అదనపు డీఎంహెచ్ఓ & డీఎల్ఏటీఓ డా. వి. సోమల నాయక్ గారు, రామానంద ట్రస్ట్ సభ్యులు డా. శ్రీకాంత గారు తదితర జిల్లా అధికారులు మరియు NTEP సిబ్బంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, టిబి వ్యాధి నిర్మూలనకు వైద్య చికిత్సతో పాటు సరైన పోషకాహారం ఎంతో కీలకమని తెలిపారు. టిబి రోగుల ఆరోగ్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. టిబి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత అవసరమని అన్నారు.Bapatla Local News
ఈ విధమైన కార్యక్రమాల ద్వారా టిబి రోగులకు శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా ధైర్యం లభిస్తుందని అధికారులు తెలిపారు.










