
చీరాల:-చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో రామానంద్ ట్రస్ట్ (వాడరేవు) ఆధ్వర్యంలో, శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం–ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా పౌష్టిక పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు, శ్రీ అరుణానంద స్వామీజీ గారు హాజరై, క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పౌష్టిక పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. క్షయ నిర్మూలనలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
అనంతరం రామానంద్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయంగా చెక్కులను అందజేశారు. సమాజ సేవలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మాలకొండయ్య గారు ప్రశంసించారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










