
అమరావతి:28-11-25:-రాష్ట్ర ప్రభుత్వం పిపిపి విధానంలో ఏర్పాటు కానున్న వైద్య కళాశాలల భూ వినియోగం, నామకరణం, సిబ్బంది నిర్వహణతో పాటు ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల నియంత్రణపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.పిపిపి వైద్య కళాశాలల భూముల్లో వాణిజ్యానికి నిషేధంపిపిపి పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేటాయించిన భూముల్లో ఎటువంటి వాణిజ్య, వైద్యేతర నిర్మాణాలకు అనుమతి లేదని క్యాబినెట్ స్పష్టం చేసింది.ఈ భూముల్లో 625 పడకల ఆసుపత్రి, 150 అండర్ గ్రాడ్యుయేట్, 24 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లతో కూడిన మెడికల్ కాలేజీ, సిబ్బంది వసతి గృహాలు వంటి అవసర సదుపాయాల నిర్మాణాన్ని మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది.భవిష్యత్తులో అవసరాన్ని బట్టి దంత కళాశాల, నర్సింగ్ కళాశాల, టెలీమెడిసిన్ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు, ఆయుష్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈ అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో 3% ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాలి.నాలుగు మెడికల్ కాలేజీల భూ కేటాయింపుల్లో కోతగత ప్రభుత్వం మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల పిపిపి కళాశాలలకు కేటాయించిన భూములను పునఃసమీక్షించిన ప్రభుత్వం వాటిని మొత్తం 257.50 ఎకరాల నుంచి 197.71 ఎకరాలకు తగ్గించింది.
ఎకువగా కేటాయించిన 59.79 ఎకరాలు తిరిగి ప్రభుత్వాధీనంలోకి వస్తాయి.
ముఖ్యంగా మదనపల్లి కాలేజీ భూసమీకరణను 97 ఎకరాల నుంచి 52.47 ఎకరాలకు తగ్గించారు.ప్రస్తుత సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం భరిస్తుందిపిపిపి ఆసుపత్రుల నిర్వహణ ప్రారంభమైన తర్వాత రెండు సంవత్సరాల పాటు ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య, అవైద్య సిబ్బంది జీతాలను ప్రభుత్వమే చెల్లించనుంది.కొత్తగా నిర్మించే ఆసుపత్రులు పూర్తయ్యాక, ప్రస్తుత బోధనాసుపత్రులు తిరిగి ప్రభుత్వ పర్యవేక్షణలోకి వస్తాయి.పిపిపి కళాశాలలకు ప్రభుత్వ నామకరణం తప్పనిసరిపిపిపి మోడల్‌లో ఉన్న వైద్య కళాశాలలకు అనివార్యంగా “ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి” అని పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది.కళాశాల ఉన్న ప్రాంతం పేరును దీనికి జత చేస్తారు. ఉదాహరణకు:ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, మార్కాపురం.పిపిపి భాగస్వామి పేరును 70:30 నిష్పత్తిలో ప్రదర్శించవచ్చు.అదనంగా పెరిగే పడకల్లో 70 శాతం క్యాష్‌లెస్ సేవల కోసం కేటాయించాలి అని ఆదేశించింది.ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులను నియంత్రణలోకినకిలీ వైద్యులను అరికట్టేందుకు ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులపై కఠిన నియంత్రణలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటి వరకు కేవలం అల్లోపతిక్ ఆసుపత్రులు మాత్రమే ఉండే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2010 పరిధిలోకి ఇప్పుడు ఆయుర్వేద, యునాని, యోగ, సిద్ధ, హోమియోపతి ఆసుపత్రులను కూడా తీసుకురానుంది.ఇకపై ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులుతప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలిప్రమాణాలు, రికార్డు నిర్వహణ పాటించాలిఅర్హత గల వైద్య సిబ్బంది ఉండాలిదీంతో సేవల నాణ్యత పెరగడంతో పాటు ప్రజల్లో ఆయుష్ వైద్యం పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.







