
విజయవాడ: అక్టోబర్ 11:– రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గిరి బలిజ జీ.ఓ. నంబర్ 5పై స్టేటస్ కో ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, ఆ జీ.ఓ.ను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీ.ఓ. 7ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ మంత్రి సవిత, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
గిరి బలిజ అనే పేరు ద్వారా బలిజ, కాపు వర్గాలను అవమానించారని ఆరోపించిన చందు జనార్దన్, కాపు వర్గాల సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ కొత్త సమస్యలు తీసుకురావడం బాధాకరమన్నారు. గతంలోనుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాపు వర్గాల కోసం కాపు జేఏసీ డిమాండ్లు:
- కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల బీసీ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం.
- కాపు కార్పొరేషన్‌కు నిధుల మంజూరు.
- కాపు భవనాల నిర్మాణం పూర్తి చేయడం.
- కృష్ణా జిల్లాలో వంగవీటి మోహనరంగా పేరిట నామకరణం.
- జనాభా ఆధారంగా నామినేటెడ్, రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత.
- ప్రభుత్వ ఉద్యోగాలలో కాపు వర్గానికి ప్రాధాన్యత గల పోస్టింగులు.
బీసీ రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు, పర్యటనలు నిర్వహించి చివరికి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు.
ఉద్యమానికి మద్దతుగా పలువురు నేతలు:
గిరి బలిజ జీ.ఓ. 5 ఉపసంహరణ కోసం ఉద్యమించిన శ్రీ కృష్ణ దేవరాయ కాపు ఉద్యోగుల సంఘం కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ, రాయలసీమ బలిజ సంఘ నాయకులు, కాపు ఉద్యోగులు, టీచర్లు తదితరులకు ఉద్యమ వందనాలు తెలిపారు.
జీ.ఓ. 7 తీసుకురావడంలో సహకరించిన మాజీ సీఎస్ రామమోహన్, మెండు చక్రపాణి, పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా పాల్గొన్నవారు:
ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, కడప జేఏసీ నాయకులు సమతం రాము, ముళ్ళపూడి నాగేశ్వరరావు, చందు భావన్నారాయణ, ఆటో నగర్ అధ్యక్షుడు రాజనాల బాబ్జి, ప్రైవేట్ స్కూల్స్ సంఘం అధ్యక్షుడు సాయి, రాష్ట్ర సెక్యూరిటీ అధ్యక్షుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.






