
విజయవాడ, అక్టోబర్ 29: రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం విజయవాడలోని హోటల్ మినర్వా గ్రాండ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరికి చెందిన ఎం.డి. ఇబ్రహీం నూతన డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో చైర్మన్ మౌలానా ముష్టక్ అహ్మద్, నూతన డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మంగళగిరి ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, దేశం తమ్ముళ్లు ఇబ్రహీం, ముష్టక్ అహ్మద్‌లను పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్ ఇబ్రహీం, మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.







