
చీరాల:= సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తా చాటారు. యస్.ఆర్.కె.ఆర్ ఇంజినీరింగ్ కాలేజి, భీమవరం వేదికగా నిర్వహించిన జైత్రా–2026 వేడుకల సందర్భంగా జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషులూ, మహిళలూ విభాగాల్లో సెయింట్ ఆన్స్ జట్లు విజేతలుగా నిలిచాయని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా|| కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బలమైన పోటీ మధ్య సెయింట్ ఆన్స్ జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి రెండు విభాగాల్లోనూ విజయం సాధించడం గర్వకారణమని అన్నారు.
పురుషుల విభాగంలో 20 కళాశాలల జట్లు పాల్గొనగా, ఫైనల్స్‌లో స్వర్ణాంద్ర ఇంజినీరింగ్ కాలేజ్, నర్సపూర్ జట్టును ఓడించి సెయింట్ ఆన్స్ జట్టు విన్నర్స్‌గా నిలిచింది. ఈ జట్టులో ఆర్. రమణ, జి.వి.ఆర్. తేజా రెడ్డి, రాజారత్నం, జి. మైకేల్, కె. డాని, కె. సాయి కుమార్, నవీన్, ఆదిత్య, డేని వెంకట మణి కుమార్ పాల్గొన్నారు.Bapatla Local News
మహిళల విభాగంలో 16 కళాశాలల జట్లతో పోటీ పడి, ఫైనల్స్‌లో శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ జట్టుపై గెలుపొందింది. ఈ జట్టులో కె. అనిత, కె. ఉమా మహేశ్వరి, నిషిత, భూమిక, సుష్మ, మానస, హారిక, ప్రవల్లిక, స్రవంతి, రిక్కిల సభ్యులుగా ఉన్నారు.
ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన కళాశాల వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
విజయోత్సవంగా నిర్వహించిన అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అక్రిడిటేషన్స్) డా|| సి. సుబ్బారావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వాలీబాల్ జట్లకు హర్షాతిరేక అభినందనలు తెలిపారు.










