chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలోని ఉల్లి రైతులకు శుభవార్త,ఉల్లి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియా తో మాట్లాడుతూ ఉల్లి పంట పండించిన రైతులకు హెక్టారుకు రూ.50,000 ఆర్థిక సాయం అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు రూ.100 కోట్లు అదనపు భారం పడనుందని అన్నారు. కర్నూలు ఖరీఫ్ సీజన్ లో 45,278 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసారని, 24, 218 మంది రైతులు లబ్ధిపొందుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్యకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. పంటకు ధర పలికినప్పుడే ఉల్లిని విక్రయించాలని రైతులకు మంత్రి సూచించారు. మార్కెట్లో సమయానుసారం ధరలు లభించే వరకు రైతులు సహనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆర్థిక సాయం రైతులకి తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతులనుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామ‌ని, 2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 కోట్లు చెల్లించామ‌ని తెలిపారు. జ‌గ‌న్ హ‌యాంలో 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే, నామ మాత్రంగా క్వింటాకి రూ.770/-లు మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా, కేవ‌లం 250 మంది రైతుల‌ ద‌గ్గ‌ర 75 ల‌క్ష‌లు ఇచ్చి ఉల్లిని కొని రైతులని నిండా ముంచారని మండిపడ్డారు. రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతమని ఆయన అన్నారు. రైతుల శ్రమకు గౌరవం కల్పించేందుకు, వారికి న్యాయమైన ధరలు లభించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కల్పించే విధంగా పంటలకు కొనుగోలు ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి, వారిని ఆర్థికంగా బలపరిచే విధంగా పలు సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తోందని అన్నారు. కేవలం మాటలకే పరిమితమైపోయిన గత ప్రభుత్వం మాదిరి కాకుండా, మా ప్రభుత్వం రైతులకు సాక్షాత్కారమైన లాభాలను అందజేస్తుందని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడం తమ ప్రభుత్వ ధ్యేయమని, భవిష్యత్తులో కూడా మరింత బలమైన విధానాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker