
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 31:జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆదివాసి సంఘాల జేఏసీ, పాల్వంచ నాయకులు సంఘీభావం తెలిపారు. భూ బాధితుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా జేఏసీ ప్రతినిధులు సోయం సత్యనారాయణ, అడ్వకేట్ పర్సిక సోమరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దీక్షలు చేస్తున్న ఆదివాసుల సమస్యలను కలెక్టర్ తక్షణమే గుర్తించి పరిష్కరించాలని కోరారు. భూ సమస్యలపై తాసిల్దార్లకు సరైన సూచనలు జారీ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆహ్వానించారు.సోయం సత్యనారాయణ గారు మాట్లాడుతూ, “ఆదివాసుల భూములు రక్షించటం ప్రభుత్వ బాధ్యత. తక్షణ చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. దీక్షా శిబిరంలో పలువురు ఆదివాసి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.







