Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
మూవీస్/గాసిప్స్

రేణు దేశాయ్ రెండో పెళ్లిపై కీలక వ్యాఖ్యలు – పిల్లల భవిష్యత్ తర్వాతే కొత్త జీవితం..

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ రెండో పెళ్లిపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. గతంలో రెండో పెళ్లిపై ఆమెను తరచూ ట్రోల్ చేసినా, ఆమె తనదైన ధైర్యంగా స్పందిస్తూ వచ్చింది.

తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – “రెండో పెళ్లి చేసుకోవాలని నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పట్లో కాదు. నా పిల్లలు అకీరా నందన్, ఆద్య సెటిల్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. వాళ్లు కాలేజీకి వెళ్లి, తమ జీవితాల్లో స్థిరపడిన తర్వాతే నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అప్పుడే నాకు పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడే నిజంగా నా జీవితాన్ని ఆనందించగలను,” అని తెలిపారు.

తన రెండో పెళ్లిపై కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా మద్దతుగా ఉన్నారని రేణు దేశాయ్ చెప్పింది. “అకీరా, ఆద్య ఇద్దరూ నన్ను పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు. ‘మమ్మీ, నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్లను పెళ్లి చేసుకో’ అని పిల్లలు చెప్పడం నాకు ధైర్యం ఇచ్చింది. వాళ్లే నా నిర్ణయానికి పూర్తి మద్దతుగా ఉన్నారు,” అని ఆమె వివరించింది.

అయితే, పిల్లలు ఇప్పటికే తండ్రికి (పవన్ కల్యాణ్) దూరంగా ఉన్న నేపథ్యంలో, తాను కూడా పెళ్లి చేసుకుని మరో కుటుంబంలోకి వెళ్లిపోతే, పిల్లలు ఒంటరితనంతో బాధపడతారనే భావనతో ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని చెప్పింది. “పిల్లలు చిన్నవాళ్లు ఉన్నప్పుడు వాళ్లను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం సబబు కాదని అనిపించింది. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లు అవుతున్నారు. మరో రెండు మూడేళ్లలో వాళ్లు కాలేజీకి వెళ్తారు. అప్పుడే వాళ్లకు ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త ప్రపంచం వస్తుంది. వాళ్ల జీవితాల్లో స్థిరపడిన తర్వాత నేను కూడా నా జీవితం కొత్తగా మొదలు పెడతాను,” అని రేణు దేశాయ్ భావోద్వేగంగా వివరించింది.

తనపై వచ్చిన విమర్శలకు కూడా ఆమె ధైర్యంగా స్పందించింది. “పవన్ కల్యాణ్‌ను నేను వదిలేయలేదు, ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయినా నేను నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం లేదు. నా జీవితంలో జరిగే ప్రతి నిర్ణయం నా పిల్లల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుంది. అందుకే నేను నా పిల్లల భవిష్యత్‌ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను,” అని స్పష్టం చేసింది.

ఇటీవల రేణు దేశాయ్ సినిమాల్లో కూడా రీ-ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించింది. తాజాగా మరో సినిమాకు సైన్ చేసినట్టు ప్రకటించింది. “ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాను. నా కొత్త సినిమా గురించి త్వరలో వివరాలు చెబుతాను,” అంటూ తన సినీ కెరీర్‌పై కూడా పాజిటివ్‌గా ఉంది.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button