
Repalle:- రేపల్లెలో ఆత్మీయ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు కలిసి పాల్గొని మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను మరింత ఉత్సాహంగా మార్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి సేవలను, ప్రజల పట్ల వారి నిబద్ధతను నేతలు కొనియాడారు.Repalle:జగజీవన్ రామ్ 118 వ జయంతి సీపీఎం కార్యాలయంలో
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, ఆ శాఖకు నాయకత్వం వహిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. వారి జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలతో, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలు స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.










