
Guntur:రేపల్లె : 13-11-25:-కూటమి ప్రభుత్వం పిపిపి (PPP) విధానంలో కొత్తగా ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపల్లె నియోజకవర్గంలో నిరసన ర్యాలీ జరిగింది.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపల్లె వైయస్సార్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ డాక్టర్ గణేష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీ అనంతరం పార్టీ ప్రతినిధులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ప్రభుత్వం ప్రజల పన్ను డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం అన్యాయం అని వారు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య విద్యను ప్రైవేటు చేయడం ద్వారా పేదలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు చిమటా బాలాజీ, చిత్రాల ఓబేదు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపి, రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ పద్మ, రాష్ట్ర ఫంక్షన్స్ విభాగం జాయింట్ సెక్రటరీ సూరి, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు చదలవాడ శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, రేపల్లె పట్టణ కన్వీనర్ కరేటి శేషగిరిరావు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.







